Talasani Srinivas Yadav | రేపే దీక్షా దివస్.. తెలంగాణ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇంచార్జిలు ఆనంద్ గౌడ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణా ఉద్యమాన్ని కీలకమలుపు తిప్పిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం రావాలి.. తెలంగాణ రాష్ట్రం కావాలని నినదించడం జరిగిందని గుర్తు చేశారు. అటువంటి దీక్షా దివస్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని అన్ని నియోజకవర్గాల నుండి బైక్‌లపై ర్యాలీగా బసవ తారకం హాస్పిటల్ సర్కిల్ వరకు చేరుకుంటారని, అక్కడి నుండి పాదయాత్రగా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని వివరించేలా ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరుగుతుందని, అనంతరం సభ నిర్వహణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hemant Soren | జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
South Korea: దక్షిణ కొరియాలో భీకర హిమపాతం.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్
Telangana | గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించిన సర్కార్.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- deeksha diwas
- Hyderabad
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

