అమరావతి : ఏపీలోని రాజమహేంద్రవరం మెడికోల( Medicos ) ప్రమాదానికి కారణమైన దుష్యంత్, జోసఫ్‌లను పోలీసులు అరెస్టు (Accused Arrest ) చేశారు. ఇద్దరిని శుక్రవారం కోర్టులో హాజరు పరచగా ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేశ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అన్నారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
ఈనెల 3న రాజేంద్రమహేంద్రవరం సినిమామాల్లో సినిమా చూసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మెడికోలను మద్యం మత్తులో కారును నడుపుతున్న ఇద్దరు ఢీ కొట్టారు. దీంతో మెడికోలు ప్రియాంక, మరో మెడికోకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేస్తున్నారు.