South Korea: దక్షిణ కొరియాలో భీకర హిమపాతం.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్
South Korea: సియోల్ సిటీలో వరుసగా రెండో రోజు భీకర స్థాయిలో హిమపాతం కురిసింది. దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటేసింది. డజన్ల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు.
సియోల్: దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్ నగరంలో.. వరుసగా రెండో రోజు తీవ్ర స్థాయి హిమపాతం కురిసింది. దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటి పరిచినట్లు అయ్యింది. డజన్ల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. బోట్లు కూడా రద్దు అయ్యాయి. చలి తీవ్రత తట్టుకోలేక కనీసం అయిదు మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. గడిచిన శతాబ్ధ కాలంలో ఇంత భారీ స్థాయిలో హిమపాతం కురవడం ఇది మూడోసారి. రికార్డుల ప్రకారం 1907 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే సియోల్లో ఈ స్థాయిలో మంచు కురిసింది.
సియోల్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సుమారు 40 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. దీంతో దాదాపు 140 విమానాలను రద్దు చేశారు. గ్యాంగ్వాన్ ప్రావిన్సులోని వోంజు నగరంలో సుమారు 53 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఆ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సియోల్లోని ప్రధాన విమానాశ్రయం ఇంచియాన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. గియాంగి ప్రావిన్సులో ఉన్న వందలాది స్కూళ్లను మూసివేశారు.
పొరుగుదేశమైన ఉత్తర కొరియాలో కూడా తీవ్ర స్థాయిలో మంచు కురిసింది. సుమారు 10 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

