Ramayana | అత్యంత భారీ స్థాయిలో రామాయణ విడుదల
Ramayana | రామాయణ సినిమాను భారీ స్థాయిలో 59,000 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇలా అయితే పుష్ప2, ఆర్ఆర్ఆర్, అవతార్2 సినిమాల రికార్డులను బద్దలుకొట్టినట్లే అని సినీ నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Ramayana | నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ సినిమా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు సినీ జగత్తులో వినిపిస్తున్న మాట. దీంతో ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించనుంది. అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలను నిర్వహిస్తున్న సోనీ పిక్చర్స్ విదేశాల్లో ని 50,000 స్క్రీన్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 59,000 స్క్రీన్లపై విడుదల చేస్తున్నారని సాక్నిక్ (Sacnilk) నివేదిక పేర్కొంది. దీని గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.
రణ్బీర్ కపూర్ రాముడి (Lord Rama)గా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా, రాముడి తండ్రి దశరథుడిగా అరుణ్ గోవిల్ (90ల్లో టీవీ సీరియల్ రామాయణలో రాముడి పాత్రధారి), సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళి (నవంబర్ 6)కి విడుదల కానుంది. రిలీజ్కు ముందే ఈ సినిమా రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతుంది. జూలై 30న విడుదలైనఈ సినిమా ట్రైలర్కు విశేష స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక ఇతిహాస గాథ అయిన ఈ చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
పుష్ప2, ఆర్ఆర్ఆర్లతో పోలిస్తే..
అల్లు అర్జున్ నటిచంని పుష్ప(Pushpa)2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12,000 నుంచి 13,000 స్క్రీన్లలో, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సుమారు 10,000 నుంచి 11,000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇవేకాదు ప్రధానమైన భారతీయ సినిమాలు చాలా 10,000 కంటే ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించారు. వీటికంటే ఎక్కువగా 59,000 స్క్రీన్లలో విడుదలైతే రామాయణ రికార్డు సృష్టిస్తుంది. అలాగే జేమ్స్ కామెరూన్ తీసిన హాలీవుడ్ సినిమా అవతార్2 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 52,000 స్క్రీన్లలో విడుదలైనట్లు సమాచారం.
50 భాషల్లో..
ఈ సినిమాను కేవలం భారతీయ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా (World Wide) పరిచయం చేయాలనుకున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా గతంలో తెలిపారు. అందుకే ఈ చిత్రాన్ని సుమారు ప్రపంచ వ్యాప్తంగా 50 భాషల్లో విడుదల చేయనున్నారు. ఏఐ ఆధారిత లిప్ సింక్ టెక్నాలజీతో ఐమ్యాక్స్ స్క్రీనింగ్లతో సహా ప్రీమియం ఫార్మాట్లో కూడా రూపొందిస్తున్నారు. ఇందుకు డీఎన్ఈజీ బ్రహ్మ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

