Hemant Soren | జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ (Hemant Soren) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
#WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.
(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe
— ANI (@ANI) November 28, 2024
రాంచీ (Ranchi)లో జరిగిన ఈ కార్యక్రమానికి హేమంత్ సోరెన్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు షిబు సోరెన్, రూపి సోరెన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునితా కేజ్రీవాల్, ఎంపీ రాఘవ్ చద్ధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.
#WATCH | Jharkhand: JMM national president Shibu Soren and his wife Roopi Soren attend the oath ceremony of their son and CM-designate Hemant Soren, in Ranchi. pic.twitter.com/GcRr0xHC0z
— ANI (@ANI) November 28, 2024
#WATCH | Ranchi: At the oath ceremony of his father, Jharkhand CM-designate Hemant Soren, Nitil Soren says, “I am very happy for my father…Everyone has come to witness this. To the tribals, I would like to say that Jharkhand Mukti Morcha (JMM) is working for you, working for… pic.twitter.com/jux0ZssQSt
— ANI (@ANI) November 28, 2024
#WATCH | Ranchi: AAP national convener Arvind Kejriwal, his wife Sunita Kejriwal, party MP Raghav Chadha and Punjab CM Bhagwant Mann arrive at the oath ceremony of Jharkhand CM-designate Hemant Soren.
(Video: ANI/Jhargov TV) pic.twitter.com/p57TwIiPAy
— ANI (@ANI) November 28, 2024
#WATCH | Ranchi: Tamil Nadu Deputy CM and DMK leader Udhayanidhi Stalin arrives at the oath ceremony of Jharkhand CM-designate Hemant Soren. pic.twitter.com/drvwg4Cllj
— ANI (@ANI) November 28, 2024
Also Read..
PM Modi | ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. అప్రమత్తమైన పోలీసులు
Delhi | ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్లో అత్యంత శీతల పరిస్థితులు
Maharashtra | సీఎం పీఠంపై స్పష్టత..! షిండేసేనకు 12, అజిత్ వర్గానికి 9 మంత్రి పదవులు..?