PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి హత్య బెదిరింపులు వచ్చాయి (threat call). ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.
గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్ (Mumbai Police control room)కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.
Also Read..
Delhi | ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్లో అత్యంత శీతల పరిస్థితులు
Maharashtra | సీఎం పీఠంపై స్పష్టత..! షిండేసేనకు 12, అజిత్ వర్గానికి 9 మంత్రి పదవులు..?
Priyanka Gandhi | తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. వయనాడ్ ఎంపీగా ప్రమాణం