2 నేరేడ్మెట్, ఫిబ్రవరి 2 : చిన్నారుకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం సోషల్ సర్వీస్ నాయకుడు మండల రాధాకృష్ణ యాదవ్‌తో కలిసి కాకతీయనగర్‌లోని డింపుల్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల నుంచే మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం ప్లేస్కూల్ ప్రిన్సిపల్ టి. దివ్య రాజ్ మట్లాడుతూ క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడమే డింపుల్ ప్లేస్కూల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మండల చిన్నయాదవ్, రాజ్, మండల భరత్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్