Jasprit Bumrah: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన పర్యనటకు ముందే భారత జట్టుకు బిగ్ షాక్. శ్రీలంక పర్యటనకు ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఫిట్నెస్ టెస్టులో పాసైన బుమ్రా.. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే అందుకు కారణం. దాంతో, లంకతో రెండు టెస్టుల సిరీస్‌కు యార్కర్ కింగ్ అందుబాటులో ఉండడని ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది.
శ్రీలంక పర్యటనకు స్క్వాడ్‌తో కలుస్తాడనుకున్న జస్ప్రీత్ బుమ్రా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రెండు రోజుల క్రితమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ సాధించిన అతడు.. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి.. లంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన బుమ్రాను స్క్వాడ్ నుంచి తప్పించనుంది బీసీసీఐ. ఇంగ్లండ్ పర్యటనలో రెండో వన్డేలో గాయపడిన యార్కర్ కింగ్.. అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు ఆడలేదు. సీఓఈలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన అతడు.. శ్రీలంక పర్యటనకు సిద్ధంగా ఉంటాడని బీసీసీఐ ఆశించింది. కానీ, అతడు వంద శాతం కోలుకోలేదు. దాంతో.. బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ దళానికి అనుభవజ్ఞుడైన సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే.. బుమ్రా స్థానంలో మరొకరిని ఇంకా స్క్వాడ్‌లోకి తీసుకోలేదు.
Jasprit Bumrah will miss India’s two-Test series against Sri Lanka https://t.co/SZQCuZcVvi pic.twitter.com/CL8qLOwc5F
— Cricinfo (@cricinfo) August 2, 2026
భారత జట్టు ఆగస్టు 4వ తేదీన శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం గాలేలో ఆగస్టు 15వ తేదీన తొలి టెస్టుకు ముందు శుభ్‌మన్ గిల్ సేన నాలుగు రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే.. అనుకోని కారణాల వల్ల షెడ్యూల్ మారింది. నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌ను కాస్త మూడు రోజులకు కుదించారు. ఇందుకు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. గాలే టెస్టు అనంతరం ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న గిల్ సేన.. ఈ రెండు మ్యాచుల్లో గెలిచినా టాప్-2లోకి వచ్చే అవకాశాలు తక్కువే.
భారత టెస్టు స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.