BRS NRIs | దేవాదుల ప్రాజెక్టుకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐల తీర్మానం
BRS NRIs | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ నాయకులు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాలపాలై ఒక కాలును, ఒక కన్నును కోల్పోయినప్పటికీ, ఆయన ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి వరకు అంకితభావంతో పోరాడారని కొనియాడారు.
BRS NRIs | అమెరికాలో జరుగుతున్న ఏటీఏ (ATA) మహాసభల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఇన్చార్జ్ మహేష్ తన్నీరు తిరుపతి రెడ్డి, ఎర్రంరెడ్డి, చందు తాళ్లా, నరసింహ నాగులవంచ, రజనీకాంత్ కోసనం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాలపాలై ఒక కాలు, ఒక కన్ను కోల్పోయినప్పటికీ.. ఆయన ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి వరకు అంకితభావంతో పోరాడారని కొనియాడారు. పెద్ది లాంటి త్యాగధనులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని అన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు, ఉద్యమ త్యాగాలకు శాశ్వత గుర్తింపుగా దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలి అని మహేష్ తన్నీరు ప్రతిపాదించారు. ఆయన స్వస్థల ప్రాంతంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోని పక్షంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు.
ఆశయాలకు కట్టుబడి పనిచేయడమే నిజమైన నివాళి
సంస్మరణ సభ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నాయకులు, ఎన్నారైలు, జర్నలిస్టులు పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.

ఆటా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘పెద్ది’ స్మరణ సభలో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, బాలమల్లు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడారి కిషోర్, పుట్ట మధు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, రేగట్టె మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వేలాది మంది హాజరయ్యారు.
Read Also :
క్షమించడం కాదు.. క్షమాపణ కోరాలి.. మోదీ వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
Flight Crash | ఘోరం.. కుప్పకూలిన టూరిస్ట్ విమానం.. 13 మంది దుర్మరణం
Sandeep Reddy Vanga | ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం.. ‘రామాయణ’ ట్రైలర్‌పై సందీప్ రెడ్డి వంగా పోస్ట్
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

