బెంగళూరు: కుర్కురే ప్యాకెట్లో వచ్చిన చిన్న టాయ్ బాల్‌తో బాలుడు ఆడుకున్నాడు. అయితే పొరపాటున అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. (boy dies choking on toy ball) కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గౌరీపుర గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు కుర్కురే ప్యాకెట్ తిన్నాడు. అందులో ఉచితంగా అందించిన చిన్న బాల్‌తో ఆడుకున్నాడు.
కాగా, ఆ బాలుడు ఆడుకుంటూ పొరపాటున ఆ చిన్న బాల్‌ను మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఆ బాలుడు మరణించాడు.
మరోవైపు ఆ గ్రామంలోని ప్రముఖ కుటుంబానికి చెందిన ఏకైక సంతానం కావడంతో ఆ బాలుడి కుటుంబంతో పాటు గ్రామస్తులలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సమాచారం తమకు తెసిందని పోలుసులు తెలిపారు. అయితే ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేని చెప్పారు.