మేడ్చల్ రూరల్, జనవరి 24 : మున్సిపాలిటీల అభివృద్ధికి తాము ఓ ప్రణాళిక బద్దంగా కృషి చేశామని, నాడు కేసీఆర్ హయాంలోనే(BRS regime) పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పడేండ్ల బీఆర్ఎస్ పాలనలో మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధికి మారుపేరుగా నిలిచిందన్నారు.
మున్సిపాలిటీల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధిక నిధులు వెచ్చించడంతో ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిక్షరిస్తూ, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Kidney Rocket | కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం
KTR | కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! : కేటీఆర్