Kidney Rocket | హైదరాబాద్ : కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందన్న మంత్రి పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.
ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో అలకానంద ఆస్పత్రి చైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి ఉన్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆరు నెలలుగా అలకానంద ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ఒక్కో శస్త్ర చికిత్సకు రూ. 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలకానంద ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Meerpet Murder Case | మీర్పేట హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం..?
KTR | కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! : కేటీఆర్