హైదరాబాద్ : మూసీ నదిపై(Musi river) అఖిలపక్ష సమావేశం( All party meeting) ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. మూడు నెలల ముందే సమావేశం పెట్టి ఉంటే హైద రాబాద్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడిమా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎన్ని చెరువులు ఉన్నాయో సీఎం చెప్పాలి. చెరువుల కబ్జాలంటూ బీఆర్ఎస్పై నిందనలు మోపుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు.
60,70 ఏండ్ల నుంచి పేద ప్రజలు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, అన్ని రకాల పన్నులు కడుతున్నారని, ఇప్పుడు అక్రమమని కూల్చివేస్తే పేదల జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. మూసీ నదిని అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా వంద శాతం సపోర్ట్ చేస్తాం. కానీ, పేదలను ఒప్పించి, మెప్పించి సరైన ఉపాధి కల్పించి ఖాళీ చేయించాలని సూచించారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిది. నగరం పేరును చెడగొట్టదని హితవు పలికారు.
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3