MLA KP Vivekananda | బీఆర్ఎస్పై కోపంతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేపీ వివేకానంద మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే రిపేర్లు చేపట్టాలని.. ప్రభుత్వానికి చేతగాకపోతే ప్రాజెక్టును మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పుడైనా , ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వెంటనే నీళ్లను నిల్వ చేసి రైతులను ఆదుకోవాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. 45 లక్షల జనాభా ఉన్న జైపూర్ నగరంలో మెట్రో ఫేస్ 2 పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. పనులు కూడా మొదలయ్యాయి.. కానీ దాదాపు 1.3 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మెట్రో అనుమతులు ఎందుకు ఇవ్వరు..? బీజేపీ ఎంపీలు ఈ అంశంపై సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వ జీవో మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఉంది. ముఖ్యమంత్రి టూరిజం శాఖ మీద రివ్యూ పెడితే.. ఆ సంబంధిత శాఖ మంత్రి జూపల్లి పోయి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా ? అని ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ శాఖకి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద వచ్చింది అంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకోటి లేదన్నారు.
కేసీఆర్ పరిపాలన, అవలబించిన విధానాల వల్లే ఈరోజు తెలంగాణ దేశంలో మూడో సంపన్న రాష్ట్రంగా నిలిచిందని కేపీ వివేకానంద స్పష్టం చేశారు. కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణను వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ గమనించి తెలంగాణ గొప్పతనాన్ని చెప్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలను పచ్చి మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వ జీవో మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఉంది
సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా ?
పంచాయితీ రాజ్ శాఖకి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద వచ్చింది అంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకోటి లేదు
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద https://t.co/GzbGVWJ7Br pic.twitter.com/BCeeYMxKN4
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026