ఉప్పల్, నవంబర్ 22 : ఆలయాల అభివృద్ధికి(Temples) తమవంతు తోడ్పాటు అందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari) అన్నారు. హబ్సిగూడ డివిజన్ వెంకట్‌రెడ్డినగర్‌లో నల్ల పోచమ్మ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ పూజా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు పనులు చేపడుతున్నామని చెప్పారు. ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
సమిష్టిగా పనులు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమంలో కలిసిరావాలని సూచించారు. అధ్యాత్మికత ప్రజలలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, గంధం నాగేశ్వర్రావు, గడ్డం సాయయికిరణ్, డా.చారి, సోమమిరెడ్డి ,పవన్, శంకర్, చాంద్‌పాషా, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కొనుగోలు కేంద్రాల్లేక ధాన్యం దళారుల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు : హరీశ్ రావు
Future City | ప్రాణాలు పోయినా భూములివ్వం.. కందుకూరు, కొడంగల్‌లో తిరగబడ్డ రైతులు