Harish Rao | ఖమ్మం : రాష్ట్రంలో ఎక్కడా కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మద్దతు ధర లభించక పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని పేర్కొన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటైన ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదని హరీశ్‌రావు తెలిపారు.
అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది? రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Niranjan | బీకేర్‌ఫుల్.. పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు పెడుతాం : నిరంజన్
KTR | పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం.. మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం: కేటీఆర్
High Court | స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు