హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలసత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నీలి మేఘాల్లో విహరిస్తుంటే, గురుకులాల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయని విమర్శించారు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం చేస్తుంటే.. మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం అంటూ మండిపడ్డారు. పురుగుల అన్నం తిని అంబులెన్సుల్లో విద్యార్థులు దవాఖానల పాలవుతుండగా, పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాప్టర్లలో రేవంత్, మంత్రుల షికార్లు చేస్తున్నారని ఫైరయ్యారు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి.. విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
‘నీలి మేఘాల్లో సీఎం రేవంత్.. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు
పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం- మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం
కంచం లో పురుగులు, కాటేసే పాములు, కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం- అదానితో దోస్తీ,అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటం
కనీస వసతులు లేక,సరిపడా మరుగుదొడ్లు లేక,అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం- లగచర్ల పై లాఠీ విరిచి, రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటం
పురుగుల అన్నం తిని అంబులెన్స్ లో విద్యార్థులు-పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్, మంత్రుల షికార్లు
మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి-విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు
పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం-మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం
కంచం లో పురుగులు,కాటేసే పాములు,కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం- అదానితో దోస్తీ,అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటం
కనీస వసతులు లేక,సరిపడా… pic.twitter.com/kogeUg60rX
— KTR (@KTRBRS) November 22, 2024