హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నికంకుశంగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ పేరుతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటు న్నది. ఫార్మా సిటీ పేరిట(Future City) లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరువకముందే తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, కొంగరకలాన్‌లో మరోసారి రైతులు తిరగబడ్డారు. ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించి సర్వే పనులు చేపపడుతున్నారు.
కాగా,30 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నది. హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించాలని తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 16 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. దీనికి అదనంగా 16 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. ప్యూచర్ సిటీ కోసం అదనంగా16 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు.
పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే
మా భూములు ఇవ్వం అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
ఫార్మా సిటీ పేరిట కొడంగల్ లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరువకముందే కందుకూరు, కొంగరకలాన్‌లో మరోసారి తిరగబడ్డ రైతులు
ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వం అంటున్న రైతులు https://t.co/tNONxJ7rKh pic.twitter.com/HTIWrO0sXX
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2024