Metro Rail | హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.
మ్యాచ్ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సమయం పొడిగించినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇక ఆర్టీసీ కూడా అదనపు బస్సులు నడపనుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక మూడు టీ20ల సిరీస్ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి..
Woman Molest | కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం
Alia Bhatt | అలియా కుమార్తెకు ఊహించని గిఫ్ట్ పంపిన రామ్ చరణ్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నటి