హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నది. ముందస్తు ప్రణా ళికలు లేకుండా మూసీ పరీవాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే కూల్చివేస్తుండటంతో నిరుపేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తాజాగా హైడ్రా కూల్చివేతల(Hydra demolitions) భయంతో ఓ వ్యక్తి గుండెపోటుతో(Heart attack) మృతి (Man died) చెందాడు. వివరాల్లోకి వెళ్తే..అంబర్పేట్ నియోజకవర్గం తులసీరాం నగర్లో మూసీ కూల్చివేతల భయంతో రెండు రోజులుగా భయపడుతున్న గంధ శ్రీకుమార్ (55) అనే వ్యక్తి గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించాడు. మృతుడి ఇప్పటికే భార్య చనిపోగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీకుమార్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
హైడ్రా కూల్చివేతల భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి
అంబర్పేట్ నియోజకవర్గం తులసీరాం నగర్లో మూసీ కూల్చివేతల భయంతో రెండు రోజులుగా భయపడుతున్న గంధశ్రీకుమార్ (55) అనే వ్యక్తి గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించాడు.
కుమార్కు ఇప్పటికే భార్య చనిపోగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. pic.twitter.com/PmAgIreiXG
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024
Also Read..