James Bond 007 | హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు రాగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బాండ్ రోల్లో సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లాజెన్బై, రోజర్ మూరే, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ నటించగా.. ఆ పాత్రలకు ప్రత్యేక ఇమేజ్ తీసుకోచ్చారు. అయితే ఈ బాండ్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది.
అక్టోబర్ 05న బాండ్ డేను పురస్కరించుకొని ఇప్పటివరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంచునున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ ఖాతాదారులందరూ నేటి నుంచి ఫ్రీగా ఈ సినిమాలు చూడవచ్చని పేర్కొంది.
In celebration of #JamesBond, all 25 007 films are now available to watch on @PrimeVideo. pic.twitter.com/XITHuIDLRa
— James Bond (@007) October 1, 2024