ఉప్పల్, జనవరి 3 : ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పల్(Uppal) పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఉప్పల్ ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన బాబ్జిగౌడ్(45) రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, ఉదయం టెర్రస్‌లోని నాలుగో ప్లోర్లో వాకింగ్ కోసం వెళ్లాడు. వాకింగ్ చేస్తుండగా, హైబీపీతో కళ్లు తిరిగి కిందపడిపోవడంతో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్