Cold Wave | హైదరాబాద్ : తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగిందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యంత కనిష్ఠంగా హెచ్సీయూలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహెచ్ఈఎల్ వద్ద 8.8, రాజేంద్రనగర్లో 9.4, మౌలాలీలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోయారు. శుక్రవారం రాత్రి కూడా ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్