Cold Wave | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి గాలుల తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పొగమంచు కూడా విపరీతంగా కురుస్తోంది. దీంతో నగర వాసులు వణికిపోతున్నారు.
గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా కురియడంతో.. తెల్లవారుజామున పనులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, పటాన్‌చెరుతో పాటు ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో పొగమంచు కురియడంతో నగర వాసులు చలికి వణికి పోయారు.
గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో 15 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పోడిపోయాయి. హెచ్‌సీయూలో 11 డిగ్రీల సెల్సియస్, మౌలాలీలో 12.1, రాజేంద్రనగర్‌లో 12.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
MLA Vivekananda | కేసీఆర్ మార్గంలో రేవంత్ రెడ్డి నడవక తప్పదు : ఎమ్మెల్యే వివేకానంద
MLA Talasani | సనత్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే తలసాని
Hidden Camera | గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. విద్యార్థినుల ఆందోళన