Khaja Mohijuddin | హైదరాబాద్ : నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్పై హత్యా ప్రయత్నం కలకలం రేపుతోంది. ఖాజా మొహినుద్దీన్ తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా దుండగులు వెనుక నుంచి ఓ మరో కారులో వేగంగా వచ్చి మొహినుద్దీన్‌ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఖాజా మొయినుద్దీన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందాడు.
హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొహిజుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను ట్రేస్ చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాదిపై హత్యాయత్నం
తన ఇంటి నుండి బయటకు రాగానే న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టి పారిపోయిన దుండగులు
ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం pic.twitter.com/8bJ1Z8hpxz
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026