ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 27: తెలంగాణ అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ(BRSV) ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ -2025(KCR Cup-2025) బ్రోచర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కార్యక్రమ నిర్వాహకుడు కొంపెల్లి నరేశ్, నేతలు బోయపల్లి నాగరాజు, కురువ పల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొంపెల్లి నరేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే ఈ ఏడాది సైతం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న కేసీఆర్ కప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేస్తామని వివరించారు.
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay | పద్మ అవార్డులు స్థాయి ఉన్నవాళ్లకే ఇస్తాం.. గద్దర్‌కు ఎలా ఇస్తాం : బండి సంజయ్
KTR | ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి.. మనకు అజీర్తి అయిందట : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్