KTR | హైదరాబాద్ : ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట.. మనం ఈనో తాగాలట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్‌లను చూసి ఏడ్వాలో.. నవ్వాలో అర్థం కావడం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉల్టా ఉన్నావు.. తుపాకీ పట్టుకుని విద్యార్థుల మీదకు గురిపెట్టావు. ఉద్యమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు తేడా ఏందంటే.. 9 నెలల పాటు ఒక తల్లి బిడ్డను ఎలా మోస్తదో.. పురిటినొప్పులు పడుతూ ఒక బిడ్డకు ఎలా జన్మనిస్తదో.. అలానే టీఆర్ఎస్ కూడా కేసులు ఎదుర్కొని, దెబ్బలు తిని, ఎదురుదెబ్బలు తిని, అవమానాలకు గురై 14 ఏండ్లు పాటు తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి.. చావు నోట్లో తలపెట్టి.. తల్లి పాత్ర పోషించి, పురిటినొప్పులు పడి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన పాత్ర టీఆర్ఎస్ది. తెలంగాణ ఉద్యమంలో నీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది.. ఉంటే గింటే ఆ మంత్రసాని పాత్ర పోషించింది అని కేటీఆర్ తెలిపారు.
నీవు పెట్టబడులు తెస్తే అందరికంటే ఎక్కువగా సంతోషపడుతాం. రూ. లక్షా 78 వేల కోట్లు అని బిల్డప్ ఇచ్చుడు కాదు.. 2024లో ఇట్లనే చెప్పారు.. రూ. 42 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ ఇవాళ ప్రజలు మీ మీద అనుమాన పడుతున్నారు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటదో.. కాంగ్రెస్ పార్టీ 420 హామీల్లో కూడా వాస్తవం అంతే ఉంటది అని. 42 వేల కోట్ల పెట్టబడులు అని చెప్పినా.. ఇప్పటికీ ఒక్కటి కూడా రాలేదు.. కాబట్టి నిన్ను ఎవరు నమ్ముతలేరు. ప్రభుత్వ, ప్రజల పైసలతో హోర్డింగ్స్ పెడుతున్నవ్.. మా బొమ్మలు ఎందుకు.. చేతనైతే నీ బొమ్మ పెట్టుకో. రేవంత్ రెడ్డి చేతనైతే ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో చెప్పు.. మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో చెప్పు. మా కంటే ఎక్కువ చేసి చూపెడితే మీకు సన్మానం కూడా చేస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
నిన్న కొడంగల్‌లో ఒకటే స్పీచ్‌లో రెండు మాటలు మాట్లాడిండు.. తెల్లారే వరకు అందరికి రైతు భరోసా పైసలు పడుతవి అని చెప్పిండు.. 15 నిమిషాల్లో మాట మార్చిండు.. రేవంత్ రెడ్డిని చూస్తే డౌటస్తుంది.. అపరిచితుడు సినిమాలో రాము, రెమోలా ఉన్నాడు. అందరికీ తెల్లారే వరకు డబ్బులు పడుతవి అని అన్నాడు.. పది నిమిషాల్లోనే మాట మార్చి 31 వరకు అన్నాడు. ఏడాది మళ్లీ చెప్పలేదు. కాబట్టి వీరి మాటలకు గ్యారెంటీ లేదు. మార్చి 31 డెడ్‌లైన్ ఎందుకు పెట్టిండో తెలుసా.. ఓట్ల కోసం. 12786 గ్రామపంచాయతీలు ఉంటే 612 గ్రామాల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తడంట అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ ఏడాది పాలనలో 12 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని.. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్