KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత కూడా 12 వేల ఉద్యోగాలు దాటలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వెళ్లి.. గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని దుష్ప్రచారం చేసి.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ఇవాళ్టికి ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇక కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,283 ఉద్యోగాలను భర్తీ చేశాం. కానీ ఇవ్వనేలేదు అని కాంగ్రెసోళ్లు ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏడాదికి 16 వేల ఉద్యోగాల చొప్పున భర్తీ చేశాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యాం. పేపర్లు లీక్ అయ్యాయని అభ్యర్థులను రెచ్చగొట్టి మనకు దూరం చేశారని కేటీఆర్ తెలిపారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ చెప్పారు. ఏడాది పూర్తయినా తర్వాత కూడా 12 వేల ఉద్యోగాలు దాటలేదు. మనం వేసిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి తామే ఇచ్చినట్టు ఫోజులు కొట్టుకుంటున్నారు. అందుకే ఈ విషయాలను సోషల్ మీడియా, కాలేజీ, స్కూల్ సభల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. మెడికల్, రెసిడెన్షియల్, నర్సింగ్ కాలేజీల గురించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఉన్న అవకాశం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇతర రాష్ట్రాలకు ఈ వెసులుబాటు లేదు. ఓపెన్ కేటగిరలో కూడా మనం కొట్లాడొచ్చు. రాష్ట్రపతిని ఒప్పించి, మెప్పించి కేసీఆర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని.. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్
KTR | ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు