KTR | ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారంటే.. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారంటే.. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
గత 10 ఏండ్లలో కేసీఆర్ నాయకత్వంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోడెద్దుళ్ల మాదిరిగా ముందుకు పోయింది. పరిశ్రమలు, పర్యావరణం, ఐటీ, వ్యవసాయం రంగంలో దేశానికి దిక్సూచిగా నిలిచాం. విద్యా రంగంలో కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వెయ్యికి పైగా గురుకులాలను స్థాపించారు.. కేసీఆర్ నాయకత్వంలో బహుశా దేశంలో స్వాతంత్ర్యం అనంతరం ఏ రాష్ట్రంలో జరగలేదంటే అది అతిశయోక్తి కానే కాదు అని కేటీఆర్ తెలిపారు.
గురుకుల విద్యాసంస్థలు తీసుకుంటే.. దేశంలో వెయ్యి పైచిలుకు పాఠశాలలు ఏర్పాటు చేశాం. అణగారిన వర్గాలు దళితులు, గిరజనులు, బలహీన వర్గాల పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏర్పాటు చేశాం. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. 60 డిగ్రీ గురుకుల కాలేజీలు, 146 ఉన్న ఇంటర్ రెసిడెన్షియల్ స్కూళ్లను 592కు తీసుకుపోయాం. మొత్తంగా 294 గురుకులాల నుంచి 1022 చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు కేవలం 5 ఉంటే.. కేసీఆర్ నాయకత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ కాలేజీలే కాకుండా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలు చేశారు. అటవీ, హార్టికల్చర్, వెటర్నరీ, మహిళా యూనివర్సిటీలు స్థాపించాం. ఆ యూనివర్సిటీలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టి గౌరవించుకున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యా దాకా ఎంతో అభివృద్ధి చేశాం. 26 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి అనే కార్యక్రమాలకు రూ. 7400 కోట్లతో శ్రీకారం చుట్టాం. ఒక దశ పూర్తి చేశాం ఇంతలోనే ప్రభుత్వం మారింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్
Harish Rao | మాట తప్పడం.. మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన: హరీశ్ రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Congress govt
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

