Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్
Indiramma Atmiya Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Indiramma Atmiya Bharosa | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు చెల్లించేలా రేవంత్ సర్కార్ పథకాన్ని రూపొందించింది.
కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పురపాలకాల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. 129 పురపాలకాల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో ఉన్న వారికి ఇచ్చి పురపాలకాల్లో ఉన్న వాళ్లకు ఇవ్వకపోవడం సరైంది కాదు అని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రైతు కూలీలు ఎక్కడున్న అందరూ సమానమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేవలం గ్రామాల్లోని వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అని చెప్పారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పురపాలకాల్లోని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకం వర్తించడంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మాట తప్పడం.. మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన: హరీశ్ రావు
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

