హైదరాబాద్: పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మారుస్తారని, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. మాట తప్పడం, మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 2023, డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 2024, ఆగస్టు 15కు వాయిదావేశారు. తీరా ఆ తేదీ వచ్చేనాటికి దసరా వరకు మాఫీ చేస్తామని మాటమార్చారని విమర్శించారు. నేటికీ 20 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ అందలేదని చెప్పారు.
ఇప్పుడు తీసుకుంటే రైతుబంధు రూ.10 వేలు, అదే డిసెంబర్ 9 తర్వాత అయితే రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని విమర్శించారు. వానాకాలం రైతు భరోసా ఎగరవేశారని చెప్పారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్పారని, దానిని జనవరి 26కు అంటూ మాట మార్చారని తెలిపారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసరా రూ.4 వేలు, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
మాట తప్పడం – మడమ తిప్పడం..
ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన..
పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారు. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు.రుణ మాఫీ:
Dec 9, 2023 కు రుణమాఫీ,
ఆగస్ట్ 15, 2024 వరకు రుణమాఫీ,
దసరా వరకు రుణమాఫీ..
నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు
అందని రుణమాఫీ..రైతు…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 27, 2025