KTR | రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒక్కటే ఉంటది. మెట్రో భూముల ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కాం మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నడు. మెట్రో దగ్గర 280 ఎకరాల విలువైన భూములున్నాయి. సుమారు రూ.30 వేల కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, బావమరిదులతో, అల్లుడికో కట్టబెట్టేందుకే ఆ 280 ఎకరాల విలువైన భూములపై కన్నేసిండు కాబట్టే ఇవాళ ఆ మెట్రోను స్వాధీనం చేసుకుని.. 14 వేల కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నడని మండిపడ్డారు. చూడండి రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు.. ఎవరు కొంటారు. ఎట్లా అమ్ముతాడో చూస్తారన్నారు కేటీఆర్.
కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. మెట్రోకు మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు కేటీఆర్. రాయదుర్గం మీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్రనగర్ దగ్గర 3 స్టాపులు పెట్టి పట్ట ణం పెరుగుతున్నది.. ఇక్కడికెళ్లి అక్కడిదాకా ట్రాఫిక్ పెరుగుతుంది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్-జులై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలుకొట్టి మొదలుపెట్టినం. సీఎం రేవంత్ రెడ్డి రాగానే తీసుకున్న తుగ్లక్ నిర్ణయం ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేస్తున్నవ్ నాయనా అంటే చెప్పడని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ మెట్రో కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. రెండేళ్లలోనే పూర్తికావాలని షరతు పెట్టినం. అందులో లాండ్ అక్విజిషన్ కూడా లేదు. భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్వేల్, నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే.. హైదరాబాద్ పెరగాలే.. అనే ఉద్దేశంతో మనమొక నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండున్నర ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారు.. మళ్లీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందేనన్నారు కేటీఆర్ .
రేవంత్ రెడ్డి కన్ను మెట్రో భూముల మీద ఉంది
మెట్రో దగ్గర రూ.30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూములను ఆయన అన్నదమ్ములకో, బావమర్ధులకో కట్టబెట్టాలని చూస్తున్నాడు
అందుకే ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని రూ.14 వేల కోట్ల భారం ప్రజలం మీద వేసి.. ఆ భూములను అమ్ముకోవాలని చూస్తున్నాడు
– కేటీఆర్ pic.twitter.com/mzFEenIHp3
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేశాము
కానీ రేవంత్ రెడ్డి రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు
ఆరోజు గనక రద్దు చేయకుండా ఉంటే ఈపాటికే పూర్తి అయిపోయేది
రెండున్నర ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు… https://t.co/29O4DjDaPv pic.twitter.com/5gLF7yuf1G
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్