Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్
Prabhas | ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’ తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించగా, ప్రతి సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అయితే ఈ ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
Prabhas | ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’ తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించగా, ప్రతి సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అయితే ఈ ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని 2026 చివర్లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఫౌజీ’ 2027లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే 2027లో ప్రభాస్ నుంచి ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. మరోవైపు ‘బాహుబలి’ ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చే యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ కూడా 2027లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అదే సమయంలో ‘ఫౌజీ’ కూడా అదే ఏడాదిలో విడుదలైతే, ప్రభాస్ అభిమానులకు ఒకే ఏడాదిలో మూడు భారీ ట్రీట్స్ లభించినట్లవుతుంది. దీంతో 2027ను ఇప్పటికే అభిమానులు ‘ప్రభాస్ నామ సంవత్సరం’గా అభివర్ణిస్తున్నారు. భిన్నమైన కథలు, భారీ స్థాయి నిర్మాణ విలువలు, పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ చిత్రాలు ఒకే ఏడాదిలో విడుదలైతే భారతీయ సినీ పరిశ్రమలోనే అరుదైన రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఈ ప్రాజెక్ట్‌ల అధికారిక విడుదల తేదీలపైనే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

