హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా(Hydraa)కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా నాగారం (Nagaram)మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, హైడ్రా అధికారులు కూల్చివేతలు కొసాగిస్తుండటంతో సామాన్యుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఏ అర్ధరాత్రి వచ్చి జేసీబీలో మా ఇండ్లు కూల్చి వేస్తారేమోనని భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి