Sanitation Workers | పారిశుద్ధ్య కార్మికులు ఒక్క రోజు పనిచేయకపోతే వీధుల్లో చెత్త పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ రోజూ వీధులను శుభ్రంగా ఉంచే కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ కనీస గౌరవం ఇయ్యాలన్నా ఆలోచన కూడా చేయడం లేదనడానికి ఈ దృశ్యమే ఉదాహరణ. హైడ్రా అధికారులు కార్మికులతో ప్రమాదకర స్థితిలో పనులు చేయిస్తున్నారు.
నాంపల్లి, గోషామహల్ పరిధిలో హైడ్రా అధికారులు ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న తీరు వారి పట్ల ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత, గౌరవం ఉందో చెప్పకనే చెబుతోంది. నాలాల్లోకి కార్మికులను దింపేటప్పుడు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం గ్లౌజ్‌లు, అద్దాలు, మాస్క్‌లు కూడా ఇవ్వని పరిస్థితి అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. నాలాలంటే చెత్తాచెదారంతోపాటు గాజు ముక్కలు, ప్రమాదకర వస్తువులు ఉండటమే కాదు.. వివిధ పరిశ్రమల నుంచి విడుదల చేసే విషపూరిత రసాయనాలు కూడా ఉంటాయి.
డ్రైనేజీ, మురుగు కాలువలు, మ్యాన్‌హోల్, సెప్టిక్ ట్యాంకుల్లో కార్మికులు దిగకూడదని.. తప్పనిసరిగా యంత్రాలతోనే శుభ్రపరచాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలను ఏమీ పట్టించుకోకుండా కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్న దృశ్యాలు కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణ చేస్తున్న హైడ్రాలో సేఫ్టీ మెజర్ మెంట్స్ ఎలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పోలీసులు దగ్గరుండి పనులు చేయిస్తుండడంతో కార్మికులు ఇలాంటి దుస్థితి ఏంటని ప్రశ్నించేందుకు కూడా భయపడుతున్నారు.
ప్రమాదకర స్థితిలో కార్మికులతో పనులు చేయిస్తున్న హైడ్రా
ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న హైడ్రా అధికారులు
కార్మికులకు కనీసం గ్లౌజ్‌లు, అద్దాలు, మాస్క్‌లు కూడా ఇవ్వని పరిస్థితి
నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర వస్తువులు ఉండే అవకాశం.. విషపూరిత… pic.twitter.com/iublYDC71Q
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026