Hyderabad Metro | హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. నూతన సంవత్సవర వేడుకల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళ్లల్లో అధికారులు మార్పులు చేశారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులను పొడిగించారు. రాత్రి 12.30 గంటలకు ఆఖరి సర్వీసు అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు. మెట్రో సేవలను హైదరాబాద్ ప్రజలు ఉపయోగించుకోవాలని, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహన రాకపోకలపై అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తామన్నారు. నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఎక్స్ రోడ్‌లోని మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు బైరామల్ గూడ ఎక్స్‌రోడ్డులోని మొదటి, రెండో లెవల్ ఫ్లైఓవర్లు ఎల్బీ నగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్‌పాస్‌ల మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ద్విచక్ర వాహనాలు, మోటారు వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండబోదన్నారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | భగీరథమ్మ చెరువులో నిర్మాణాల కూల్చివేస్తున్న హైడ్రా
New Year Celebrations | నూతన సంవత్సర వేడుకలు.. పోలీసుల ఆంక్షలు
Manchu Vishnu | మరో వివాదంలో ఇరుక్కున్న మంచు ఫ్యామిలీ.. సోషల్‌మీడియాలో వీడియో వైరల్