Heavy Rains | హైదరాబాద్ : నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 7.43 సెం.మీ., చిలుకానగర్‌లో 6.60 సెం.మీ., గన్‌ఫౌండ్రిలో 6.58 సెం.మీ., నాంపల్లిలో 6.48 సెం.మీ., నాచారం, బేగంబజార్‌లో 5.98 సెం.మీ., జవహర్‌నగర్, ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో 5.80 సెం.మీ., ఖైరతాబాద్‌లో 5.55 సెం.మీ., హిమాయత్‌నగర్ విఠల్‌వాడిలో 5.53 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో దాని ప్రభావం వల్ల రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఎండలు దంంచికొట్టాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీలు, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతి అవశేషాల తొలగింపు.. ఫొటోలు వైరల్
Hyderabad | ఈ నెల 23న పలు ప్రాంతాలలో నీటి సరఫరా బంద్
HYDRAA | విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు.. 51 పంచాయతీలపై పెత్తనం చెలాయించనున్న హైడ్రా