Khairatabad Ganesh | హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి సంపూర్ణ నిమజ్జన కార్యక్రమం ఈ నెల 17న హుస్సేన్ సాగర్‌లో జరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మందికి 11 రోజుల పాటు దీవెనలు అందించిన 70 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడు.. మంగళవారం సంపూర్ణంగా నిమజ్జనం అయ్యారు. ఇక శుక్రవారం హుస్సేన్ సాగర్ నుంచి అవశేషాల తొలగింపులో భాగంగా దైవత్వం కోల్పోయిన మహా గణనాథుడి ఉక్కు మాతృకలను సిబ్బంది బయటకు వెలికితీశారు.
ఈ నెల 17న ఉదయం 6.30 గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం వరకు ముగిసింది. మహాగణపతిని ట్రాయిలర్పై ఎక్కించేందుకు హైడ్రాలిక్ క్రూజ్ క్రేన్‌ను వినియోగించారు. 70 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాన్ని తీసేందుకు ఈ క్రేన్‌కు ఉన్న 142 ఫీట్ల జాక్‌ను ఉపయోగించారు. కాగా, మహాగణపతి హుండీ ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హుండీ లెక్కింపులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు.. 51 పంచాయతీలపై పెత్తనం చెలాయించనున్న హైడ్రా
Hyderabad | ఈ నెల 23న పలు ప్రాంతాలలో నీటి సరఫరా బంద్
Ration Cards | అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు.. దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి?