Harish Rao | పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో అయిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే అని భట్టి విక్రమార్క ఇచ్చిన లెక్కల్లోనే ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత FRBMలో డిసెంబర్ 12న రూ.500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, జనవరి 16న రూ.2000 కోట్లు, జనవరి 23న రూ.1000 కోట్లు ఇలా మొత్తం 3 నెలల్లోనే రూ.15,118 కోట్లు అప్పు చేశారన్నారు. భట్టి విక్రమార్క FRBMలో వాళ్ళు చేసిన రూ.15,118 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలోని పాత అప్పు రూ.84,268 కోట్లు కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేశాడని వివరించారు.
ఈ రెండు అప్పులు తీసేస్తే బీఆర్ఎస్ పదేళ్లలో అయిన అప్పు రూ.4,17,495 కోట్లు అని నేను 40 సార్లు చెప్పానని హరీశ్ రావు గుర్తు చేశారు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భట్టి విక్రమార్క కోపంతో ఊగిపోయి ఆగ్రహంగా మాట్లాడితే లెక్కలు మారిపోతాయా..? హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి తప్పులు, అబద్ధాలు మాట్లాడొచ్చా..? అని అడిగారు.
లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. లంచాలు ఇచ్చి, బ్రోకర్లను పెట్టి, కమిషన్లు ఇచ్చి బైటకి కనపడకుండా దాని బాండ్స్ అని అందమైన ముసుగు వేసి అప్పులు తెస్తున్నారు. రూ. 30000 కోట్లకు అప్పు కోసం బ్రోకర్‌కు రూ.510 కోట్ల లంచం ఇచ్చారన్నారు. లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారా అంటే.. అవును రూ.169 కోట్లు లంచం ఇచ్చి రూ.10 వేల కోట్లు తెచ్చామని అసెంబ్లీలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు తెచ్చిన రూ. 30 వేల కోట్లు చాలక మళ్లీ రూ.30 వేల కోట్లు తెస్తారు అంట, అంటే ఇప్పుడు దానికి మళ్లీ ఒక రూ.550 కోట్ల లంచం ఇవ్వాలన్నారు హరీశ్ రావు.
ఎవరి మాట నిజం..?
అప్పుల మీద భట్టి విక్రమార్క ఒకమాట, రేవంత్ రెడ్డి ఇంకోమాట మాట్లాడుతున్నారు. నిన్న భట్టి విక్రమార్క అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పి మసిపూసి మారేడు కాయ చేసి, రూ.1,77,000 కోట్ల అప్పు చేశామని అంటడు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి రూ.3,47,294 కోట్లు అన్నడు. ఎవరి మాట నిజం..? అని ప్రశ్నించారు హరీశ్ రావు
లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
లంచాలు ఇచ్చి, బ్రోకర్లను పెట్టి, కమిషన్లు ఇచ్చి బైటకి కనపడకుండా దాని బాండ్స్ అని అందమైన ముసుగు వేసి అప్పులు తెస్తున్నారు
రూ. 30000 కోట్లకు అప్పు కోసం బ్రోకర్‌కు రూ.510 కోట్ల లంచం ఇచ్చారు
లంచం ఇచ్చి అప్పులు… pic.twitter.com/LMqOdk5nXc
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
బీఆర్ఎస్ పదేళ్లలో అయిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే అని భట్టి విక్రమార్క ఇచ్చిన లెక్కల్లోనే ఉంది
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత FRBMలో డిసెంబర్ 12న రూ.500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, జనవరి 16న రూ.2000 కోట్లు, జనవరి 23న రూ.1000 కోట్లు ఇలా మొత్తం 3 నెలల్లోనే… pic.twitter.com/6yx1gyDNYf
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..