మొక్కలు నాటేందుకు చెట్లను నరికేశారు!
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా వందలాది పెద్ద చెట్లను నరికివేశారన్న ఆరోపణలు రావడంతో అటవీ పెంపకం ప్రాజెక్టుల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి.
- మధ్యప్రదేశ్ బీజేపీ సర్కార్ తీరిది
భోపాల్, ఆగస్టు 6: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా వందలాది పెద్ద చెట్లను నరికివేశారన్న ఆరోపణలు రావడంతో అటవీ పెంపకం ప్రాజెక్టుల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సుమారు 10,000 మొక్కలు నాటేందుకు కాంట్రాక్టు ఇచ్చిన కలియాసోట్ ప్రాంతంలో ఈ చెట్ల నరికివేత ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ముండ్ల పొదలను తొలగించమని కాంట్రాక్టర్‌కు సూచించినప్పటికీ ఆరోగ్యకరమైన పచ్చని చెట్లను కూడా నరికివేశారు. పెద్ద చెట్లను నరికివేసి ఆ స్థానంలో మొక్కలు నాటితే అవి పెరుగడానికి ఎంతకాలం పడుతుందని, అంతకంటే పెద్ద చెట్లను సంరక్షించడం వల్ల చాలా ఎక్కువ పర్యావరణ ప్రయోజనాలు కలుగుతాయని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. ఈ వివాదంపై బీఎంసీ అధ్యక్షుడు కిషన్ సూర్యవంశీ స్పందిస్తూ ప్రాథమిక విచారణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందని, ఆయనకు రూ. 3.5 లక్షల జరిమానా విధించామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

