Harish Rao | నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న దిల్సుఖ్నగర్, నేడు అశోక్ నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకుని.. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని ఆరోపించారు.
ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
జాబ్ లెస్ క్యాలెండర్‌గా జాబ్ క్యాలెండర్..
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారని మండిపడ్డారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నవు..నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు
గ్రంథాలయాల్లో పోలీసులు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు.
ఈ రోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా BRS చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
నిన్న దిల్సుఖ్నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ
ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి… pic.twitter.com/9QBlvEb8kj
— Harish Rao Thanneeru (@BRSHarish) January 8, 2026
Tirupati Express | తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్‌కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు