GenePoweRx : జీనోమిక్ ఇన్సైట్స్ ఆధారంగా AI-పవర్డ్ పర్సనలైజ్డ్ మెడిసిన్‌లో ఒక మార్గదర్శక సంస్థ అయిన జీన్ పవర్ ఎక్స్ (GenePoweRx).. జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలకు అవసరమయ్యే ప్రధాన సాధనాలు, సాంకేతికతలను అభివృద్ధి చేసే సంస్థ అయిన MGI టెక్ కో. లిమిటెడ్ (MGI Tech Co. Ltd)తో సహ మార్కెటింగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఏఐ పవర్డ్ ఎనలిటిక్స్, కట్టింగ్ ఎడ్జ్ సీక్వెన్సింగ్ ద్వారా ప్రిడక్టివ్ హెల్త్‌కేర్, ప్రెసిషన్ మెడిసిన్, లాంగెవిటీ సైన్స్ ల్యాండ్ స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది.
ఈ భాగస్వామ్యం పర్సనలైజ్డ్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌ను మరింత ప్రభావవంతం చేయడానికి, మరింత అందుబాటులోకి తేవడానికి తోడ్పడనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా GenePoweRx, MGI టెక్ సంస్థలు జీనోమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఏఐలో తమ బలాలను ఏకీకృతం చేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలకు క్లినికల్-గ్రేడ్ జన్యు సేవలను వేగంగా అందించడానికి కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.