Uttar Pradesh | ఆగ్రా: తమకు భోజనంలో చికెన్ పెట్టలేదని, మర్యాదలు బాగా చేయలేదని, తమ బంధువులను చిన్నబుచ్చారని ఇలా చిన్నచిన్న కారణాలకే పీటల వరకు వచ్చిన పెండ్లిండ్లు నిలిచిపోవడం చూస్తున్నాం. తాజాగా కల్యాణ మండపంలో తనకు కేటాయించిన గదికి ఏసీ లేదని ఆగ్రహించిన ఒక వధువు ఏకంగా పెండ్లినే రద్దు చేసుకున్న ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.
శంషాబాద్ పట్టణంలో పెండ్లి మండపానికి వచ్చిన వధువు తనకు కేటాయించిన గదికి ఏసీ లేకపోవడాన్ని గమనించింది. వెంటనే ఏసీని ఏర్పాటు చేయాలని కోరింది. వరుడు తరపు వారు నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని ఇంట్లో తన జీవితం నరకప్రాయం అవుతుందని వధువు కల్యాణ మండపాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది.