హైదరాబాద్: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో (Ramanthapur) దారుణం చోటుచేసుకున్నది. ఐదేండ్ల బాలుడిపై లైంగికదాడి చేసి, హత్య చేశాడో వ్యక్తి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు రామంతాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న తమ ఐదేండ్ల కుమారుడు మనోజ్‌పాండే కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్‌కు చెందిన కుమార్ అనుమానాస్పదంగా కనిపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిపై సమీపంలోని ముళ్ల పొదల్లో లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
Hyderabad | గంజాయి మత్తులో గన్స్ దందా.. 15 వేలకు గన్.. 700లకు తూటా
కోరిక తీర్చు.. కాదంటే ఖతమే!.. ఇంట్లోకి జొరబడి మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరింపులు
చిక్కడపల్లిలో భారీ చోరీ.. వరుస దొంగతనాలతో హడలెత్తుతున్న నగరవాసులు
వాహనం బహు భారం.. బైక్, కారు కొనాలంటే ఆలోచించాల్సిందే