వెంగళరావునగర్,ఆగస్టు 15: కోరిక తీర్చాలని వివాహితను వేధిస్తున్న హెడ్ కానిస్టేబుల్.. తిరస్కరిస్తే భర్త, పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరిలో నివా సం ఉంటున్న మహిళ పక్కింట్లో రాజ్భవన్లో విధులు నిర్వర్తించే కార్ హెడ్ కార్టర్స్కు చెందిన ఏ.ఆర్.కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్(35)ఉండేవాడు. నాలుగేండ్లుగా అతడికి పక్కింటి మహిళతో పరిచయం ఉంది.
ఏడాది కాలంగా కోరిక తీర్చాలంటూ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్ మహిళను వేధించసాగాడు. ఇంట్లో గొడవలు అవుతాయనుకుని ఈ విషయం భర్తకు చెప్పకుండా మహిళ దాచింది. గురువారం తన పిల్లల్ని వెంటబెట్టుకుని బల్కంపేట్లోని పుట్టింటికి వచ్చింది. ఆమె ఇంట్లోకి జొరబడి చేయి పట్టుకుని తన వెంటరావాలని వేధింపులకు దిగాడు. తన కోరిక తీర్చకపోతే కుంటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధిత మహిళ కానిస్టేబుల్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.