Malakpet Metro Station | హైదరాబాద్ : మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైకుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేసి, ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Ghanta Chakrapani | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
Telangana Talli | తెలంగాణ తల్లి కాదు.. చేయి గుర్తు తల్లి..! సీఎం రేవంత్ నిర్వాకం ఇదీ..!!