Fire Accident | కొండాపూర్, డిసెంబర్ 18 : షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు ప్రమాదకరంగా మారిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కొనసాగుతున్న క్యాండూర్ భారీ బహుళ అంతస్థుల నిర్మాణానికి పనులు చేసే కార్మికుల షెడ్లలో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో షెడ్లలో ఉండే కార్మికులు వంట గ్యాస్ (సిలిండర్లు) భారీ శబ్దాలు చేస్తూ పేలిపోయాయి.
ప్రమాదం జరిగిన సమయంలో అధిక సంఖ్యలో కార్మికులు విధుల్లో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణ సంస్థ ఉద్యోగుల సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్, పటాన్చెరువు ఫైర్ అధికారులు 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో కార్మికులకు సంబంధించిన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యం..
శేరిలింగంపల్లిలో అత్యధిక అంతస్థులతో (55) నిర్మాణాన్ని చేపట్టిన క్యాండూర్ నిర్మాణ సంస్థ, తమ వద్ద పని చేస్తున్న కార్మికుల జాగ్రత్తను గాలికొదిలేసిందని, ఒకే చోట రేకుల షెడ్లను నిర్మించి వందలాది మందిని ఇరుకు గదులలో ఉంచిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే చందానగర్‌లో నిర్మాణ కార్మికుల షెడ్లు అగ్నిప్రమాదంలో కాలిబూడిదైన సంఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరిగితే తప్ప అధికారులు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!