Fire Accident | మేడ్చల్ మల్కాజ్గిరి : జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ పొగను పీల్చుకోవడంతో స్థానికులు పలువురు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం
మేడ్చల్ – దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..
పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..
ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/eMgOhvhZzE
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
Hyderabad | పార్కింగ్ విషయంలో గొడవ పడి వ్యక్తిపై దాడి.. నలుగురి అరెస్ట్
Allu Arjun | అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు