Allu Arjun Gets Regular Bail | సంధ్య థియేటర్ ఘటనలో అగ్ర నటుడు అల్లు అర్జున్‌కి భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
Also Read..