Diamond | మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోతున్న జో బైడెన్ (Joe Biden) విదేశీ ప్రముఖుల నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు తెలిసింది. విదేశీ ప్రముఖులు తమ అధికారిక పర్యటనల్లో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఫస్ట్ లేడీ (US First Lady) జిల్ బైడెన్ (Jill Biden)కు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటిల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. జిల్ బైడెన్‌కు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అత్యంత ఖరీదైనదిగా తెలిసింది.
PM Narendra Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden
The diamond reflects earth-mined diamonds’ chemical and optical properties. It is also eco-friendly, as eco-diversified resources like solar and wind power were used in its making. pic.twitter.com/5A7EzTcpeL
— ANI (@ANI) June 22, 2023
2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలో ఉన్న శ్వేతసౌధంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ .. ప్రధాని మోదీకి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు మోదీ అరుదైన కానుకలను అందజేశారు. 20 వేల అమెరికన్ డాలర్ల విలువైన 7.5 క్యారెట్ల డైమండ్ (Diamond)ను మోదీ.. జిల్ బైడెన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ఖరీదు మన భారత కరెన్సీలో రూ.17.15 లక్షలు. 2023లో అమెరికా అధ్యక్ష దంపతులకు లభించిన అన్ని బహుమతుల్లోకెల్లా ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది.
#WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/EKoFU6FGhd
— ANI (@ANI) June 22, 2023
పరిశోధనశాలలో అభివృద్ధి చేసిన 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్‌ను అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌కు మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. భూమి నుంచి వచ్చిన వజ్రం తరహాలోనే ఆ గ్రీన్ డైమండ్ లక్షణాలు ఉంటాయట. ఆ వజ్రం ఎకో ఫ్రెండ్లీ. సౌర, పవన విద్యుత్తు ద్వారా ఆ వజ్రాన్ని తయారు చేశారు. ఈ వజ్రాన్ని కాగితపు గుజ్జుతో తయారు చేసిన చిన్న పెట్టెలో ఉంచి జిల్కు అందించారు. ఇక జిల్కు యూఎస్‌లోని ఉక్రేనియన్ రాయబారి నుంచి ఓ బ్రూచ్ కూడా బహుమతిగా అందినట్లు తెలిసింది. దీని విలువ 14 వేల అమెరికన్ డాలర్లు ఉంటుంది. 2023లో అధ్యక్షుడు బైడెన్ దంపతులు అందుకున్న ఖరీదైన బహుమతుల (Joe Biden receives Expensive Gifts In 2023) వివరాలను యునైటెడ్ స్టేట్స్ చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ కార్యాలయం తాజాగా విడుదల చేసింది.
Also Read..
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు ప్రయత్నం విఫలం
HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!
Plane Crashes | భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి